Saturday, October 12, 2024
HomeతెలంగాణGodavarikhani: రైతులకు షరతులు లేకుండా వంద శాతం రుణమాఫీచేయాలి

Godavarikhani: రైతులకు షరతులు లేకుండా వంద శాతం రుణమాఫీచేయాలి

కోరుకంటి చందర్ డిమాండ్

పెద్దపల్లి జిల్లాలోని రైతులందరికి వంద శాతం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. జిల్లాలోని రైతులందరికి రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి కోరుకంటి చందర్, మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు కార్యాలయంలో కలెక్టర్ వినతి పత్రం అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులందరికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో రుణమాఫీ వచ్చిన వారందరికి ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘవిర్ సింగ్ దాసరి ఉషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News