Friday, November 22, 2024
HomeతెలంగాణGodavarikhani: గోదావరిలో పైపులు వేసి రాజమార్గంలో అక్రమ దందా

Godavarikhani: గోదావరిలో పైపులు వేసి రాజమార్గంలో అక్రమ దందా

చుట్టూ ఫెన్సింగ్ వేశాం..

గోదావరిఖని లోని గోదావరి సాక్షిగా ఇసుక దందా నడుస్తుంది. యదేచ్ఛగా గోదావరిలో పెద్దపైపులు వేసుకోని మరి రాజామార్గం ఏర్పాటు చేసుకున్నారు అంటే ఏ మేరకు ఇసుక దందా నడుస్తుందో ఇట్టే అర్దం అవుతుంది. ఒక ప్రజాప్రతినిధి అండదండలతో ప్రతిరోజు రవాణా కొనసాగుతుంది. రాత్రి పూట గోదావరిలో జెసిబి ఏర్పాటు చేసి వందల కొద్ది ట్రాక్టర్లు ఇసుక రవాణా చేసి గోదావరిఖని లో కొన్ని చోట్ల డంపుల్లు ఏర్పాటు చేస్తున్న తెలిసింది. గోదావరిలో రాత్రి పూట ఇంత జరుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రామగుండం సి.పి. ఇసుక దందపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదా లేక చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అర్థం గాని ప్రశ్న. ఏది ఏమైనా వందల కొద్ది టాక్టర్లతో ఇసుక దందా అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

చర్యలు తీసుకుంటాం: రామగుండం యం.ఆర్.ఓ

గోదావరిలో ఇసుకకు సంబంధించిన విషయము మా దృష్టికి వచ్చింది. దాని మీద చర్యలు తీసుకుంటామని దాని వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని ఇప్పటికే ఆర్.ఐ.ని పంపించామని అక్కడ పరిస్థితిని గమనించి చుట్టూ ఫెన్సింగ్ వేసామని రామగుండం తాసిల్దార్ కుమారస్వామి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News