తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో సాంస్కృతిక ఉద్యమాన్ని తన ఆటపాట ద్వారా ప్రజల్లోకి తీసుకవెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించిన పెద్దపల్లి జిల్లా కమన్ పూర్ మండలం పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన దబ్బేట పుష్పలతను తెలంగాణ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు నకిరేకంటి కిరణ్ కుమార్ నియమించారు.
ఈ సందర్బంగా దబ్బేట పుష్పలత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు గత ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారధి పేరుమీద 550 ఉద్యోగాలు ఇచ్చారని, ఇచ్చిన ఉద్యోగాలలో ఎక్కువ శాతం తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. కీలకంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అర్హులు అయిన మా ఉద్యమ కళాకారులకు అన్యాయం చేసారనీ, ఈ విషయంలో గత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలుగా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా స్పందన లేకుండా పట్టించుకోకుండా మేము చేసే ఉద్యమాలను అణిచివేసి నానా ఇబ్బందులు పెట్టారనీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనీ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామన్నారు.
ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉండడం హర్షనీయం నా నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజవెల్లి ప్రతాప్, రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి జవ్వాజి ప్రవీణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కాటేపాక శంకర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోట మహేష్ కి కృతజ్ఞతలు తెలియజేసారు. తెలంగాణ కళా వేదిక సంఘం బలపడడం కోసం అహర్నిశలు పనిచేస్తానని దబ్బేట పుష్పలత అన్నారు.