Wednesday, September 25, 2024
HomeతెలంగాణGodavarikhani: మళ్లీ ఎమ్మెల్యేగా చందర్ నే గెలిపించుకొంటాం

Godavarikhani: మళ్లీ ఎమ్మెల్యేగా చందర్ నే గెలిపించుకొంటాం

అమెరికా పర్యటన చేసిన ఎమ్మెల్యే చందర్ కు సన్మానం

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా గోదావరిఖని టిఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజల సంకల్పం కోరిక ఉద్యోగ, ఉపాధి ఐటి పార్క్ తీసుకురావాలనే అనే సంకల్పంతో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రామగుండం యువతకి ఉద్యోగాలు ఇప్పించి వారి కుటుంబాలకు భరోసాగా నిలబడాలని ముందుచూపుతో అమెరికాలో ఐటీ కంపెనీ యజమానులతో చర్చలు జరిపి ఐటిని మన రామగుండం ప్రాంతానికి ఒప్పించిన ఘనుడు ఎమ్మెల్యే చందర్ అని అన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకు కోరుకంటి చందర్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపుకోసం కృషిచేస్తామన్నారు. అలాగే కేసీఆర్ హైట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ శ్రేణులు చల్లగురుగుల మొగిలి, తోడేటి శంకర్, గుంపుల ఓదెలు యాదవ్. సిరాజుద్దీన్, దాసరి ఎల్లయ్య, హమీద్, నరసయ్య, మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News