తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జేఏసీ పిలుపు మేరకు మేనేజ్మెంట్ వైఖరికి నిరసనగా గోదావరిఖని డిపోలో కార్మికులందరు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.గత కొన్ని నెలలుగా అనేక మంది కార్మికులు రిటైర్మెంట్ కావడం వలన కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టకపోవడం వలన ఇప్పుడున్న కార్మికులకు అధిక పనిభారం పడుతుందని సంస్థలో వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలని, మహాలక్ష్మి స్కీం వలన మహిళా ప్రయాణికురాళ్ల ఒక్కో బస్ లో 100 మంది వరకు వుంటున్నారానీ దానివల్ల కార్మికులకు అదనపు భారం పడుతుందని అన్నారు.
కొత్తగా బస్ లు కొనుగోళ్లు చేయాలని, కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించాలని, బాండ్ డబ్బులు తక్షణమే ఇప్పించాలని, మహాలక్ష్మి టికెట్స్ రద్దు చేసి దాని స్థానంలో మహిళలకు స్మార్ట్ కార్డ్స్ ఇవ్వాలని, స్మార్ట్ కార్డ్ ఉండడం వల్ల టికెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని గోదావరిఖని డిపో జె.ఎ.సి. నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో TMU టి.యం.యు. నాయకులు వంగర. శ్రీనివాస్, ఇ.యం. నాయకులు కొమురయ్య, NMU ఎన్. యం.యు.నాయకులు తిరుపతి , డిపో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని నల్ల బ్యాడ్జ్ లు ధరించి తమ నిరసనను తెలియజేశారు.