ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఉచ్చిత బస్సు ప్రయాయణ సేవలు గ్రామాల్లో అమలుకు నోచుకోని వైనం, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమా నిర్వీర్యమా అలసత్వమా కారణమేందో కానీ గ్రామాల్లోకి ఆర్టీసీ బస్సు సేవలు ఆమడ దూరంలో ఉన్నాయి.
దీంతో..మేము మా అవసరం మేరకు ఊరికి పోవాలన్న రావాలన్న చాలా తిప్పలయితుంది ప్రయివేటు వాహన దారులు ఇమ్మడి ముమ్మడి గా చార్జీలువసూలు చేస్తున్నారు. ఇలా ఎన్నో గ్రామీణ పేదల బాధలు జరపట్టించుకొండ్రి ధర్మపురి ఎమ్మెల్యే సారు అంటూ తమ గోస చెప్పుకుంటున్నారు ఇక్కడి స్థానికులు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. టీఎస్ ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రావడం. మహాలక్ష్మి పథకంలో భాగంగా సోనియాగాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నామని పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా నేటి వరకు బస్సు సౌకర్యాలు లేవని గొల్లపల్లి మండల గ్రామలు గొల్లుమంటున్నాయి.
గొల్లపల్లి గుంజపడుగు తిరుమలపురం (పి.డి) రంగదాముని పల్లె రాములపల్లె నంచర్ల వెంగలయిపేట మీదుగా పెగడపల్లి వరకు 3 ట్రిప్పులు లక్ష్మిపురం దమ్మన్నపేట ఆత్మకూరు గుళ్లకోట మీదుగా ధర్మారం వరకు3 ట్రిప్పులు పూర్వం బస్సు రవాణా సౌకర్యాలు ఉండి గ్రామీణ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేది. ఏ పుణ్యాత్ముడు పున్నెం గట్టుకుండో దశాబ్ద కాలంగా మా ఊళ్లకు బస్సులు నడుత్తలేవని ప్రజలు వాపోతున్నారు.
“ఆర్టీసీ బస్సు సౌకర్యం పునరుద్ధరణ జరిగి కాంగ్రెస్ ప్రజాపాలనలో పేదలకు పెన్నిధి అవుతుంది అనుకున్నాము కానీ కాలే ఉచితం ఉత్త మాటలేనా” అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
హలో లక్ష్మణ అంటే నేనున్నా సోదరా అంటూ క్షేత్ర స్థాయి ప్రజలకు భరోసా నిచ్చే మన ధర్మపురి ఎమ్మెల్యే విప్ ఇంతవరకు పట్టించుకోకపోవడం కడుశోచనీయమంటూ గ్రామీణుల గుసగుసలు వినిపిస్తున్నాయి.