శుక్రవారం టీఎస్ ఆర్టీసి పెద్దపల్లి నుండి జగిత్యాలకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు దమ్మన్నపేటకు చెందిన భవాని మర్చిపోయిన 8 లక్షల విలువైన బంగారు నగలను పర్సులోని ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి క్షేమంగా అప్పగించిన కండక్టర్ వాణికి
గ్రామస్తులు కుటుంబ సభ్యులు చిరుసత్కారం చేశారు.
గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ పంచాయతీ ఆవరణలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ వాణికి ప్రయాణికురాలు భవాని కుటుంబ సభ్యులు గ్రామస్థులు ఆమె నిజాయితీని కొనియాడుతూ శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ..
చిన్నతనం నుంచి గురువులు, తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, ఆర్టీసీ సంస్థలో క్రమశిక్షణ తన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిందని చెప్పారు. గతంలోనూ రెండు సార్లు బస్సులో ప్రయాణికులు మర్చిపోయిన నగదు, ఆభరణాలను తిరిగి అప్పగించినట్లు తెలిపారు. తల్లి దండ్రులు ఉపాధ్యాయులు తమ పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలను సైతం బోధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిల్కురి అనసూయ చంద్రయ్య ఆర్యవైశ్య మండల ఉపాధ్యక్షుడు శివ శ్రీనివాస్ ముదాం జానారెడ్డి తూము తిరుపతి బంగుడపు రవి గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Gollapalli: నిజాయితీ కండక్టర్ వాణికి సన్మానం
8 లక్షల ఆభరణాలు జాగ్రత్తగా ప్యాసింజర్ కు చేర్చిన కండక్టర్