జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో బుధవారం రోజు నుండి ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభ మైనయి.సర్వాంగసుందరంగా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారులను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. రెండేళ్లకోసారి ఇద్దరు అమ్మవారులు గద్దెలపై రెండురోజుల పాటు కొలువై ఉండడంతో దర్శించుకునేందుకు భక్తులు పిల్లపాపాలతో పోటెత్తారు. భక్తుల రద్దీతో చిల్వకోడూర్ జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తుంది. వనదేవతల జనజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు ఎత్తు బంగారం (బెల్లం) సంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లిసున్న భక్తులు.