Friday, April 11, 2025
HomeతెలంగాణGood Friday: భక్తి శ్రద్ధలతో ఘనంగా గుడ్ ఫ్రై డే

Good Friday: భక్తి శ్రద్ధలతో ఘనంగా గుడ్ ఫ్రై డే

గుడ్ ప్రైడే రోజును పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాలోని చర్చిల్లో భక్తులు భారీగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించి, గీతాలను చేశారు. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో గల సేక్రెడ్ హార్ట్ క్యాథలిక్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.  గుడ్ ప్రైడే రోజును పురస్కరించుకొని చర్చి ప్రాంగణము నుంచి భక్తులు యేసు శిలువలను చేత పట్టుకొని ఊరేగింపుగా బెల్లంపల్లి చౌరస్తా గుండా లక్ష్మి థియేటర్ బైపాస్ రోడ్డు వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా శిలువ వేషధారుడు శిలువను మోస్తూ నడవగా ఇతర వేషధారులు వెంబడిస్తూ ఏసు వేషధారిని శిక్షించే సన్నివేశాలను అందరినీ ఆలోచింపజేశాయి. అనంతరం మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామంలోని గల కొండపై ఏసు జీవిత చరిత్రలోని ప్రధానమైన 14 సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆరాధన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ జోష్ మాణిక్యతన్, ఎబిన్, స్టీఫెన్, సిస్టర్లు, సంఘ పెద్దలు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News