Good news for government employees The list of holidays for 2026 is out: 2025 ఏడాది దాదాపు ముగింపునుకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు హాలిడేస్ లిస్టును ప్రకటించింది. 2026 ఏడాదికి గానూ సాధారణ, ఆప్షనల్ హాలిడేస్ లిస్టును సోమవారం విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో మొత్తంగా 27 పబ్లిక్ హాలిడేస్, 26 ఆప్షనల్ సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ సెలవుల జాబితా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు వర్తించనుంది.
సాధారణ సెలవులు-27
1. భోగి- జనవరి 14 (బుధవారం)
2. సంక్రాంతి-జనవరి 15(గురువారం)
3. గణతంత్ర దినోత్సవం- జనవరి 26(సోమవారం)
4. మహాశివరాత్రి-ఫిబ్రవరి 15(ఆదివారం)
5. హోలీ-మార్చి 3(మంగళవారం)
6. ఉగాది-మార్చి 19 (గురువారం)
7. ఈదుల్ ఫితర్ (రంజాన్)-మార్చి 21 (శనివారం)
8. రంజాన్ అనంతర రోజు-మార్చి 22(ఆదివారం)
9. శ్రీరామ నవమి-మార్చి 27(శుక్రవారం)
10. గుడ్ ఫ్రైడే-ఏప్రిల్ 3(శుక్రవారం)
11. బాబా జగ్జీవన్ రావు జయంతి -ఏప్రిల్ 5(ఆదివారం)
12. డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి-ఏప్రిల్14(మంగళవారం)
13. ఈదుల్ అజ్హా (బక్రీద్) -మే 27(బుధవారం)
14. రజా(10వ మొహర్రం) – జూన్ 26(శుక్రవారం)
15. బోనాలు- ఆగస్టు 10(సోమవారం)
16. స్వాతంత్ర్య దినోత్సవం-ఆగస్టు 15 (శనివారం)
17. ఈద్ మిలాన్ ఉన్ నబీ -ఆగస్టు 26(బుధవారం)
18. శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 04(శుక్రవారం)
19. వినాయక చవితి-సెప్టెంబర్ 14(సోమవారం)
20. మహాత్మా గాంధీ జయంతి -అక్టోబర్ 2(శుక్రవారం)
21. సద్దుల బతుకమ్మ – అక్టోబర్ 10(శనివారం)
22. విజయ దశమి / దసరా-అక్టోబర్ 20 (మంగళవారం)
23. విజయదశమి అనంతర రోజు- అక్టోబర్ 21(బుధవారం)
24. దీపావళి- నవంబర్ 8(ఆదివారం)
25. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి-నవంబర్ 24(మంగళవారం)
26. క్రిస్మస్-డిసెంబర్ 25 (శుక్రవారం)
27. క్రిస్మస్ అనంతర రోజు- డిసెంబర్ 26 (శనివారం)
ఐచ్చిక సెలవులు – 26
1. నూతన సంవత్సరం మొదటి రోజు (01-01-2026)
2. హజ్రత్ అలీ (ర.అ) జయంతి (03-01-2026)
3. కనుమ (16-01-2026)
4. షబ్-ఎ-మెరాజ్ (17-01-2026)
5. శ్రీపంచమి (23-01-2026)
6. షబ్-ఎ-బరాత్ (04-02-2026)
7. షహాదత్ హజ్రత్ అలీ (ర.అ) (10-03-2026)
8. జుమాతుల్ విదా (13-03-2026)
9. షబ్-ఎ-ఖదర్ (17-03-2026)
10. మహావీర జయంతి (31-03-2026)
11. తమిళ నూతన సంవత్సరం (14-04-2026)
12. బసవ జయంతి (20-04-2026)
13. బుద్ధ పౌర్ణమి (01-05-2026)
14. ఈద్-ఎ-ఘదీర్ (04-06-2026)
15. 9వ మొహర్రం (1446 హిజ్రీ) (25-06-2026)
16. రథ యాత్ర (16-07-2026)
17. అర్బాయీన్ (04-08-2026)
18. పార్సీ నూతన సంవత్సరం (15-08-2026)
19. వరలక్ష్మి వ్రతం (21-08-2026)
20. రాఖీ పౌర్ణమి (28-08-2026)
21. యజ్ దహుం షరీఫ్ (23-09-2026)
22. మహర్నవమి (19-10-2026)
23. హజరత్ సయ్యద్ మొహమ్మద్ జువాన్‌పురి మహ్దీ జయంతి (26-10-2026)
24. నరక చతుర్ధి (08-11-2026)
25. క్రిస్మస్ ఈవ్ (24-12-2026)
26. హజ్రత్ అలీ జయంతి (26-12-2026)

