Saturday, November 23, 2024
HomeతెలంగాణHyd: మీడియా మిత్రులకు శుభవార్త

Hyd: మీడియా మిత్రులకు శుభవార్త

ఏకీకృతం చేయాలని భేటీలో తీర్మానం

హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముందడుగు పడింది. దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉండటంతో మీడియా అకాడెమీ ఆ దిశలో దృష్టి సారించింది. ఈ మధ్యనే తెలంగాణా మీడియా అకాడెమీ కొత్త చైర్మన్ గా నియమితులైన శ్రీ కే. శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన హైదరాబాదులోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై సమీక్షా సమావేశం జరిగింది. ఇళ్ల స్థలాల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణపై మీడియా అకాడెమీ చైర్మన్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

- Advertisement -

కేఎస్ఆర్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన ఈ సమావేశానికి వివిధ హౌజింగ్ సొసైటీల ప్రతినిధులను ఆహ్వానించారు. సొసైటీల వారిగా ఆయా ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ మీటింగులో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వంలోని పెద్దలను సంప్రదించడానికి అన్ని సొసైటీలు ఒక్క తాటి మీదకు రావలసిన ఆవశ్యకతపై సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ, ది హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ, దక్కన్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ ల మధ్య సమన్వయం కోసం ఒక కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ మేరకు ఒక్కో సొసైటీ నుంచి ముగ్గురి చొప్పున సమన్వయ కమిటీకి ప్రాతినిధ్యం వహించేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పెద్దల దగ్గర త్వరలోనే ఒక హై లెవెల్ మీటింగు ఉండే అవకాశాలున్నందున రిపిటేషన్ లేకుండా అన్ని సొసైటీలు, వీలైనంత త్వరగా జాబితాలను సిద్దం చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న 3 సొసైటీల్లో దాదాపు అందరు జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారనీ, వీటన్నిటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి, వాటిని ఏకీకృతం చేయాలని సమావేశం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్లోని 2 వ అంతస్తులో ఇవాళ అంటే మార్చి 7 వ తేదీ, గురువారం రోజున నిర్వహించిన ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే [ఐజేయూ] రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, టీ శాట్ సీఈఓ బొదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, తెలంగాణా మ్యాగజైన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కే. శ్రీనివాస్ రావులు పాల్గొన్నారు. కాగా, ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ తరఫున సూరజ్ కుమార్, బందు శ్రీకాంత్, రాకేష్ రెడ్డి, అజయ్ కుమార్, ది హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ నుంచి రవీంద్ర బాబు మిక్కిలినేని, భూపాల్ రెడ్డి, భీమగాని మహేశ్వర్, సునీత, దక్కన్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ ప్రతినిధులుగా రామకృష్ణ, శ్రీనివాస్, విక్రం రెడ్డిలు హాజరయ్యారు.

హౌజింగ్ సొసైటీల కో ఆర్డినేషన్ కమిటీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News