Government Announces Diwali Bonus for Singareni Workers: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. దీపావళి సందర్భంగా బోనస్ కింద రూ.400 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ప్రతి కార్మికుని ఖాతాలో శనివారం రూ. 1.03 లక్షలు జమ అవుతాయని ఆయన వెల్లడించారు. బోనస్ ప్రకటించడంపై సింగరేణి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 39,500 మంది కార్మికులు లబ్ధిదారులు ఉన్నారని సింగరేణి యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఒక్కో కార్మికుడికి బోనస్ కింద రూ. 1.03 లక్షలు జమవుతాయని పేర్కొంది. ఈ నెల 18వ తేదీన (శనివారం) చెల్లిస్తామని తెలిపింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసింది. బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్ లభించడం ఇదే మొదటిసారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాగా, గత కొన్నేళ్ల నుంచి దసరా, దీపావళి సందర్బంగా కార్మికులకు బోనస్ ప్రకటిస్తూ వస్తోంది ప్రభుత్వం. సంస్థకు వచ్చే లాభాలకు అనుగుణంగా బోనస్‌లు అందిస్తోంది. ఈ క్రమంలోనే 2010- 2011 ఆర్థిక సంవత్సరంలో 21 వేలుగా ఉన్నటువంటి బోనస్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈసారి ఏకంగా ఒక్కో కార్మికుడికి ఇచ్చే బోనస్ లక్ష రూపాయల మార్కును దాటింది. దేశంలో పని చేస్తున్న ఇతర కార్మికులకు ఈపిఎల్ఆర్ బోనస్ సెప్టెంబర్ నెలలోనే అందగా, సింగరేణిలో పనిచేసే కార్మికులకు మాత్రం ఇప్పుడు అందుతుంది.
Also Read: https://teluguprabha.net/gallery/health-benefits-of-dates-eat-daily-in-the-morning/
లాభాల్లో కార్మికులకు 34 శాతం బోనస్‌గా..
కాగా, ఇటీవలే సింగరేణి కార్మికులకు దసరా కానుక ఇచ్చింది. ఇప్పుడు మరోసారి దీపావళి సందర్భంగా బోనస్ ప్రకటించింది. దీంతో ఒకే నెలలో సింగరేణి కార్మికులు పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం పొందినట్లైంది. తాజాగా, ఈ దీపావళి బోనస్‌తో రిలీజ్ కావడంతో వారి ఆనందం రెట్టింపు అయింది. బోనస్ కింద సంస్థ లాభాల్లో 34 శాతం పంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి బోనస్‌గా రూ.1,95,610 జమచేసింది. మొత్తం 71 వేల మందికి లబ్ధి చేకూరింది. బోనస్ ప్రకటనపై సింగరేణి కార్మికులతో పాటు వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అనంతరం బీజేపీపై వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకుంటుందన్నారు. ఈ విషయంపై 23న క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు.


