Monday, December 9, 2024
HomeతెలంగాణHyderabad Metro 2nd phase: మెట్రో రైలు రెండో దశ పనులకు అనుమతులు మంజూరు

Hyderabad Metro 2nd phase: మెట్రో రైలు రెండో దశ పనులకు అనుమతులు మంజూరు

Hyderabad Metro 2nd phase| హైదరాబాద్ మెట్రో రెండో దశ(Hyderabad Metro 2nd phase) పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు జీవీ 196 జారీ అయింది. దీంతో మొత్తం ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభంకానున్నాయి. ఈ ఐదు మార్గాల్లో 76.4 కిలోమీటర్ల మేర 5 కారిడార్లు నిర్మించనున్నారు. ఇందులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్ల వరకు మార్గం ఉంటుంది.

- Advertisement -

రెండో దశ మెట్రో నిర్మాణానికి మొత్తం రూ.24,269 కోట్లు ఖర్చు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,313కోట్లు.. కేంద్ర ప్రభుత్వం వాటా రూ.4.230కోట్లు ఉండనుంది. ఇక 11,693 కోట్లు (48%) అప్పు, 1,033 కోట్లు(4%) ప్రైవేట్ సంస్థలు అందించనున్నాయి. మెట్రో రైలు రెండో దశను నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

రెండో దశ పార్ట్‌ Aలో కారిడార్లు..

కారిడార్‌ 4 – నాగోలు TO శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (36.8కి.మీ)
కారిడార్‌ 5 – రాయదుర్గం TO కోకాపేట నియోపోలిస్‌ (11.6 కి.మీ)
కారిడార్‌ 6 – ఎంజీబీఎస్‌ TO చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ)
కారిడార్ 7 – మియాపూర్‌ TO పటాన్‌చెరు (13.4 కి.మీ)
కారిడార్ 8 – ఎల్బీనగర్‌ TO హయత్‌ నగర్‌ (7.1 కి.మీ)

పార్ట్ B కారిడార్..

కారిడార్‌ 9 – శంషాబాద్ TO ఫ్యూచర్‌ సిటీ (40 కి.మీ)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News