తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సరూర్‌నగర్ అలకనంద ఆసుపత్రి(Alaknanda Hospital) కిడ్నీ రాకెట్ ఘటననను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఇలాంటి వ్యవహారాలపై విచారణ చేపట్టాలని కేసును సీఐడీ(CID)కి అప్పగించించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజరనర్సింహా(Damodar Raja Narasimha) ఆదేశాలు జారీ చేశారు.
కాగా అలకనంద ఆసుపత్రిలో కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడీ దందా జరుగుతోంది. తాజాగా ఈ గలీజు దందా వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈ అంశంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ దందాలో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలని మంత్రి రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని.. మరోసారి ఇలాంటివి చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు.