Groundwater flows from Dry Borewell: యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో ఓ పురాతన బోరుబావి నుంచి పాతాళగంగ భూమిపైకి ఉబికి రావడం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రత్యేక మోటార్ లేదా విద్యుత్ మోటార్ లేకుండానే బోరుబావి నుంచి నీరు బయటకు ప్రవహిస్తోంది.
ఇప్పటికే ఎన్నో రోజులుగా ఈ బోరు ఎండిపోయి ఉపయోగానికి లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల తాజా పరిణామం చోటుచేసుకుంది. అదే పాతాళ గంగ బోరు బావి నుంచి పైకి ఉబికి వస్తోంది. గ్రామస్తుల మేలు కోసమే గతంలో త్రవ్విన ఈ బోరు ఇప్పుడు మరోసారి ఉపయోగపడే స్థితికి వచ్చింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/dasara-sankranti-christmas-holidays-in-ap-telangana-schools/
రైతులు ఈ పరిణామాన్ని.. “పాతాళ గంగ”గా వర్ణిస్తున్నారు. గత కొన్ని నెలలుగా నీటి కొరతతో సతమతమవుతున్న వారు, ఈ వర్షాల వల్ల చెరువులు, కుంటలు నిండిపోవడం, భూగర్భ జలాలు పెరగడం వల్ల పంటలకు అవసరమైన నీరు సులభంగా అందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసిన తమ పొలాలకు పంట కాలం మొత్తం నీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేశారు. కుంటలు, చెరువులు జలకళ సంతరించుకున్నాయని పేర్కొన్నారు.


