Wednesday, December 18, 2024
Homeకెరీర్Group 2 Exams: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-‌ 2 పరీక్షలు(Group 2 Exams) ప్రారంభమయ్యాయి. 783 సర్వీసుల పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆది, సోమవారాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈమేరకు టీజీపీఎస్సీ(TGPSC) పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఒక్కోపేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు 144 సెక్షన్‌ విధించారు. ఇక ఈ పోస్టుల కోసం 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

హైదరాబాద్‌లోని బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్ల తరువాత రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చిలో ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News