Saturday, October 5, 2024
HomeతెలంగాణGudem Mahipal: చెరువులకు జలకళ తెచ్చింది సీఎం కేసీఆరే

Gudem Mahipal: చెరువులకు జలకళ తెచ్చింది సీఎం కేసీఆరే

మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు పునరుజ్జీవం తెచ్చారు కేసీఆర్

అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగంలో చేపడుతున్న సంస్కరణ మూలంగా మండు వేసవిలోనూ చెరువులు అలుగులను దూకుతున్నాయని, ప్రతి రైతు పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 6వ రోజున పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పైన నిర్వహించిన సాగునీటి దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలాటాలు, బతుకమ్మలతో ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాగునీటి రంగంలో చేపట్టిన అభివృద్ధి నివేదికను అధికారులు వివరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రెడ్డి కాకతీయుల కాలంలో చెరువులను పునరుద్ధరించి పూడికలను తీస్తే తిరిగి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు పునరుజ్జీవం తీసుకుని వచ్చారని తెలిపారు. దీని మూలంగా చెరువులు నిండుకుండలా మారి ఆయకట్టు విస్తీర్ణం పెరిగి అంచనాలకు మించి పంటలు పండిస్తున్నారని తెలిపారు.

ఒకవైపు సాగునీరు.. మరోవైపు 24 గంటల విద్యుత్తు..మద్దతు ధర అందించడం మూలంగా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందారని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని చెరువులతో పాటు జిహెచ్ఎంసి, మున్సిపాలిటీల పరిధిలోని చెరువుల కట్టల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు అభివృద్ధికి ఇంకార్ సంస్థ సహకారంతో ఐదు కోట్లు నిధులు కేటాయించామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, చెరువుల విభాగం సూపరిండెంట్ ఇంజనీర్ ఆనంద్, ఇరిగేషన్ డిఈ రామస్వామి, నళిని, ఆయా మండలాల ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News