Saturday, October 5, 2024
HomeతెలంగాణGudem Mahipal: 'మన ఊరు మన బడి 'తో విప్లవాత్మక మార్పులు

Gudem Mahipal: ‘మన ఊరు మన బడి ‘తో విప్లవాత్మక మార్పులు

జిన్నారంలో విద్యార్థుల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీసు ప్రారంభం

ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి ప్రారంభించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం కిష్టాయిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (అర్బన్) లలో మన ఊరు మనబడి పథకం ద్వారా పూర్తిచేసిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రమైన జిన్నారంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం గ్రామం నుండి పాఠశాల వరకు న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఊరు మనబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో మొదటి విడతలో 55 పాఠశాలలను ఎంపిక చేసి పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. . ప్రతి పాఠశాలలో ప్రధానంగా నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్‌, పాఠశాల మొత్తం పెయింటింగ్‌ , గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్‌ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్స్‌, డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేయడం చేసినట్లు తెలిపారు. అవినీతికి తావులేకుండా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పాఠశాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కౌన్సిలర్ చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, గడ్డపోతారం సర్పంచ్ ప్రకాష్ చారి, బొల్లారం మున్సిపల్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, విద్యాశాఖ అధికారి విజయ, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ జిన్నారం మండల అధ్యక్షులు రాజేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News