Thursday, July 4, 2024
HomeతెలంగాణGudem Mahipal: హరీష్ రావు, గాలి అనిల్ కుమార్ ను కలిసిన జిఎంఆర్

Gudem Mahipal: హరీష్ రావు, గాలి అనిల్ కుమార్ ను కలిసిన జిఎంఆర్

అనిల్ ను పార్టీలోకి ఆహ్వానించి..

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ ను అమీన్పూర్ లోని ఆయన స్వగృహంలో హరీష్ రావుతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో గాలి అనిల్ కుమార్ పాత్ర అత్యంత కీలకమని వారు తెలిపారు. గాలి అనిల్ కుమార్ రాకతో టిఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు అయిందని వారు తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News