Thursday, July 4, 2024
HomeతెలంగాణGudem Mahipal Reddy: తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటు లేదు

Gudem Mahipal Reddy: తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటు లేదు

బిఆర్ఎస్ చేరిన BJP కార్యకర్తలు

తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటు లేదని, అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు అందిస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని బిజెపి సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ వార్డు సభ్యురాలు శారద తన బృందం తో కలిసి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతూ నిధులు కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. కేవలం మతతత్వ నినాదంతో ప్రజల మధ్య కలహాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పథకాలకు మారుపేరని, నోట్ల కోసం సీట్లను అమ్ముకుంటున్న చరిత్ర వారికే దక్కిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ, బిఆర్ఎస్ పార్టీకి తన విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని శ్రీ పూరి జగన్నాథ్ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ చంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News