Sunday, July 7, 2024
HomeతెలంగాణGudem Mahipal: దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు

Gudem Mahipal: దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు

నూతన దేవాలయాల నిర్మాణాలకు భూమి పూజ

దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలని, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయాల విగ్రహల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు గ్రామ కూడలి నుండి ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన దేవాలయాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో సర్వ మతాలకు సమప్రాధాన్యత ఇస్తూ, అన్ని మతాల ప్రార్థనా స్థలాల నిర్మాణాలకు సొంత నిధులు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నామని, రాబోయే ఎన్నికల్లోను ఇదే అభిమానం బిఆర్ఎస్ పార్టీపై చూపాలని విజ్ఞప్తి చూశారు. నూతన దేవాలయాల నిర్మాణాలకు సైతం సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ జనార్ధన్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News