Thursday, October 3, 2024
HomeతెలంగాణGundala: ప్రభుత్వ మహిళా ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు

Gundala: ప్రభుత్వ మహిళా ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు

ఎంగిలిపూల బతుకమ్మ..

తెలంగాణ సంస్కృతి ,సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ ను గుండాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఘనంగా జరుపుకున్నారు. అక్టోబర్ 2 న జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజు వారి వారి సొంత గ్రామాలలో, పట్టణాలలో జరుపుకోగా గురువారం మహిళా ఉద్యోగులంతా ఒకచోట చేరి గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి వంటి రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి తమ తోటి ఉద్యోగులతో ఆడి పాడి తెలంగాణ సాంప్రదాయాన్ని ఘనంగా చాటారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు తహశీల్దార్ జలజ కుమారి, ఎంపీడీవో దేవిక, డిప్యూటీ తాసిల్దార్ నీలిమ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హైమావతి, మహిళా కార్యదర్శిలు, అంగన్వాడీ టీచర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, సంఘ బంధాల ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News