Saturday, November 15, 2025
HomeతెలంగాణGussadi Kanakaraju: గుస్సాడీ కనకరాజు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Gussadi Kanakaraju: గుస్సాడీ కనకరాజు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Gussadi Kanakaraju: ప్రముఖ గుస్సాడీ కళాకారుడు గుస్సాడీ కనకరాజు(70) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. అలాగే ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం తరపున అధికారికి లాంఛనలాతో నిర్వహించనున్నారు. ఈమేరకు రేవంత్ రెడ్డి అధికారులను వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి – సంప్రదాయాలను కాపాడిన అసామాన్యుడు కనకరాజు అని కొనియాడారు.

- Advertisement -

అలాగే ఆయన మరణం తెలంగాణ కళలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న ఆదివాసీ కళకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కళాకారుడు కనకరాజని ప్రశసించారు. కనకరాజ మరణం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని తన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కనకరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా ప్రతి ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అందరినీ అలరించే కనకరాజు ఈసారి దీపావళి పండుగకు వారం రోజుల మరణించడంతో ఆదివాసీలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి గానూ 2021లో కనకరాజును భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad