Thursday, September 19, 2024
HomeతెలంగాణGutha: ప్రతిపక్షాలకు పనే లేదు: మండలి ఛైర్మన్ గుత్తా

Gutha: ప్రతిపక్షాలకు పనే లేదు: మండలి ఛైర్మన్ గుత్తా

నిరసనలతో ప్రతిపక్ష నేతలు గతంలో బిజీగా ఉండేవారు, ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు లేవు, ప్రతిపక్ష పార్టీలకు పనిలేదు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు హాలియా పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో నాగార్జున సాగర్ నియోజకవర్గ విద్యుత్ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందింది, రైతులకు ఉచితంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు. గతంలో కరెంట్ కష్టాలు ఎన్నో చూసాం. ఉమ్మడి రాష్టంలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎండిన వరి పంట, మొక్క జొన్న, మిర్చి, మొక్కలతో ప్రతిపక్షాల నేతలు నిరసనలు చేసేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతిపక్షాలకు పని లేదు. గతంలో పవర్ హాలిడేస్ కారణంగా చాలా పరిశ్రమలు మూతపడ్డాయి..కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నో పవర్ హాలిడేస్. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుంది అని గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన దక్షతతో రాష్ట్రం విద్యుత్ కాంతులతో వెలుగుతోంది. విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి వలన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందంజలో ఉందన్నారు గుత్తా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News