అచ్చంపేట పట్టణంలోని 4, 5, 7, 8, 9, 16, 17, 18వ వార్డులలో ప్రతిష్టించిన గణనాధుల మండపాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజుగారు.. సందర్శించి పూజలు నిర్వహించి విగ్నేశ్వరుడి ఆశీర్వాదం తీసుకుని ప్రజలు, రైతులు సస్యశ్యామలంగా ,సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. 18వ వార్డులో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సచివాలయం మాదిరి నెలకొల్పిన వినాయకుడి మండపం, అదేవిధంగా 7వ వార్డు వినాయకుడి లివలింగం మండపం చూపరులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ విష్ణుమూర్తి, కౌన్సిలర్ గోపిశెట్టి శివ, సో నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి మొక్తాల వెంకటేష్, నాయకులు బెల్లి బాలరాజు, రేవల్లి ఉస్సేన్, ప్రియాంకచందు, గౌస్, శంకర్ మాదిగ, పర్వతాలు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఆయా కాలనీ వాసులు పాల్గొన్నారు.