Saturday, November 15, 2025
HomeతెలంగాణGuvvala Balaraju: నల్లమల ప్రజలకు గులాబీ జెండాపై మనసు

Guvvala Balaraju: నల్లమల ప్రజలకు గులాబీ జెండాపై మనసు

లక్ష మందితో కేసీఆర్ ఆశీర్వాద సభ

గులాబీ జెండాను అచ్చంపేట ప్రజానీకం గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని టీచర్స్ కాలనీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకుల సన్నాహంగా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభకు లక్ష మందితో గర్జించి అచ్చంపేట చరిత్రను తిరగరాద్దామని ముఖ్య నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే గువ్వల పిలుపునిచ్చారు. అచ్చంపేట పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయ సమీపంలో సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. చివరి రక్తబొట్టు వరకు ప్రజాసేవలో అచ్చంపేట మట్టిలో కలిసిపోతానని, అచ్చంపేట ప్రజలే నా ప్రాణంగా వారికోసం చివరి రక్తక రక్తపు బొట్టు వరకు పనిచేస్తానని పేర్కొన్నారు.
కెసిఆర్ సభ ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుందామని ఎమ్మెల్యే జోష్యం చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండల, గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు అందరూ హాజరై ,ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad