Wednesday, February 12, 2025
HomeతెలంగాణGuvvala Balaraju: గువ్వల బాలరాజుకు పరామర్శ

Guvvala Balaraju: గువ్వల బాలరాజుకు పరామర్శ

గువ్వల కుటుంబానికి అండగా పార్టీ

అపోలోలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని పరామర్శించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు, మంత్రి హరీష్ రావు పరామర్శించారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్ కి తెలిపారు బాలరాజు, ఆయన కుటుంబ సభ్యులు.

- Advertisement -

ఉద్యమ కాలంలో ఇలాంటి ఎన్నో దాడులను ఎదుర్కొని తెలంగాణ పోరాడిన నాయకుడు బాలరాజు అన్నారు కేటీఆర్. ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేటీఆర్, హరీష్ రావు. రాష్ట్ర డిజిపి తో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతానని తెలిపారు కేటీఆర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News