Sunday, October 6, 2024
HomeతెలంగాణHafiz Yousuf: అపార కృషీవలుడు @హాఫిజ్ యూసుఫ్

Hafiz Yousuf: అపార కృషీవలుడు @హాఫిజ్ యూసుఫ్

నయా పైసా ఆశించకుండా స్వచ్ఛందంగా రంజాన్ మాసంలో తరావీహ్ నమాజ్ చదివిస్తూ ఆదర్శం సామాజిక కార్యకర్తగా.. రాజకీయ నేతగా.. ఆధ్యాత్మిక వేత్తగా.. సున్నీ మర్కజీ మీలాద్ కమిటీ అధ్యక్షుడిగా ప్రజల్లో విశేషంగా గుర్తింపు..

- Advertisement -

ప్రతి మనిషికి ఒకటి లేదా రెండు రకాల నైపుణ్యాలు ఉంటాయి. రెండు అంతకంటే ఎక్కువ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తులను నేటి సమాజంలో చాలా అరుదుగా చూస్తుంటాము. అలాంటి కోవలోకే వస్తారు కరీంనగర్ నగరానికి చెందిన సుప్రసిద్ధ ఇస్లామీయ ధార్మిక పండితుడు హాఫిజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ అలియాస్ యూసుఫ్ హాఫిజ్. ధార్మిక, రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక, పేరొందిన ఖాద్రీ వంశానికి చెందిన మంచి కుటుంబ నేపథ్య అంశాల్లో, గొప్ప పేరు ప్రఖ్యాతలు, పలుకుబడి ఉన్న హాఫిజ్ యూసుఫ్ ను ఇటు ముస్లిం సమాజంలో, అటు హిందూ సోదరుల్లో గుర్తు పట్టని వారుండరు. కరీంనగర్ నగరంలో రూరల్ పోలీసు స్టేషన్ ప్రాంతంలోని అతి పురాతన మస్జిద్, మర్కజి అహ్లే సున్నత్ వల్ జమాత్ కేంద్రమైన జామా మస్జిద్ లో గత రెండు దశాబ్దాలకు పైగా నయా పైసా ఆశించకుండా అల్లాహ్ మెప్పుకోసం తాను నేర్చుకున్న ఖురాన్ ను పవిత్రమైన రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా తరావీహ్ నమాజ్ ను చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ఖురాన్ అవతరించిన రోజు షబే ఖదర్ సందర్భంగా హాఫిజ్ యూసుఫ్ పై తెలుగుప్రభ దినపత్రిక ప్రత్యేక కథనం.

హాఫిజ్ యూసుఫ్ నగరానికి చెందిన సీనియర్ ఇస్లామీయ ధార్మిక పండితుడు. ప్రస్తుతం ఇతను ఎంఐఎం పార్టీ నగర జాయింట్ సెక్రటరీగా, సున్నీ మర్కజి మీలాద్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి దివంగత అబ్దుల్ హఫీజ్ కాంగ్రెస్ పార్టీ నుండి రెండు దఫాలుగా కౌన్సిలర్ గా శాసహబ్ మొహాళ్ల, పాత బజార్ ప్రాంతంలో విశేషంగా సేవలందించారు. తనది కాంగ్రెస్ నేపథ్య కుటుంబమైనా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పట్ల ఆయనకు అమితమైన అభిమానం. 2006లో అప్పటి 21 డివిజన్ నుండి తన తోబుట్టువైన సోదరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా బరిలో నిలిచినప్పటికి, ఎంఐఎం పార్టీ అభ్యర్థినిగా పోటీచేసిన ప్రస్తుత ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సోదరి రాఫీయా సుల్తానకు మద్దతుగా ఉండి, ఓవైపు స్నేహ బంధానికి విలువ ఇస్తూ, మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వాన్ని బలపరిచేందుకు చేసిన కృషి అప్పట్లో సంచలనం సృష్టించింది. శాసహబ్ మొహాళ్లలోని పెద్ద ఖాంధన్ అయిన ఖాద్రీ వంశానికి చెందిన హాఫిజ్ యూసుఫ్ కుటుంబ బాధ్యతల్లోనూ ఆదర్శంగా ఉంటారు. తనతో పాటున్న మరో ఇద్దరు సోదరులు ఇప్పటికి వేరు పడకుండా కలిసి ఉండటం గమనార్హం. గులాం అహ్మద్ హుస్సేన్ కు 20 మంది సలహదారుల్లో హాఫిజ్ యూసుఫ్ ది కీలకపాత్ర.

సామాజిక కార్యకర్తగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల వరకు వెళ్లిన సందర్భంలో వారిని ఇస్లామీయ సంప్రదాయ బద్ధంగా కౌన్సెలింగ్ నిర్వహించి సదరు భార్య భర్తల సంసార జీవితాలను చెడిపోకుండా కృషి చేశారు. వివిధ కేసుల్లో అనవసరంగా ఇరుక్కుని జైల్లో ఉన్న వారికి న్యాయసహయం పొందలేని వారికి సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ దృష్టికి తీసుకెళ్లి, వారిని జైలు నుండి విడిపించి, ముస్లిం సమాజానికి పెద్ద ఎత్తున సేవలందించిన ఘనత హాఫిజ్ యూసుఫ్ కే దక్కుతుంది. ఇలా సామాజిక కార్యకర్తగా, సున్నీ మర్కజి మీలాద్ కమిటీ అధ్యక్షుడిగా, ఎంఐఎం పార్టీలో కీలక నేతగా ఉన్న హాఫిజ్ యూసుఫ్ నేటి సమాజానికి ఆదర్శప్రాయలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News