తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొంది.
- Advertisement -
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల్ని సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. ఈ ఆదేశాలను అన్ని పాఠశాలల మేనేజ్మెంట్లు అమలు చేయాలని ఆదేశించారు.