కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతన ఆంబులెన్స్ లను జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఆంబులెన్స్ సిబ్బంది కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, నూతన అంబులెన్స్ల కొరకు ఎమ్మెల్యే హన్మంత్ షిండే కృషి అమోఘమని వారు ప్రశంశించారు.
ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రభుత్వ ఆసుపత్రి లోని డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడి సౌకర్యాలు, సిబ్బంది పని తీరు పై ఆరా తీశారు. మొత్తం 28 మంది ఈ సౌకర్యాన్ని వాడుకుంటున్నారని, ఇంతకు ముందు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలిసి వచ్చేదని ఆయన తెలిపారు. అనంతరం ఆసుపత్రి లొ ప్రసవించిన తల్లి బిడ్డలకు కెసిఆర్ కిట్ ని అందచేశారు.ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ పాత అంబులెన్సుల స్థానంలో కొత్త వాహనాలను ఏర్పాటు చేసినందుకు మంత్రి హరీష్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే జుక్కల్ నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి మంజూరు అయ్యేలా కృషి చేస్తున్నామని వారు తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు బిచ్కుంద, జుక్కల్ మండల ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఈ రెండు అంబులెన్స్లు జుక్కల్, బిచ్కుందలకు కేటాయించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.