Hanumantha Rao at Amberpet BC BC bandh: అంబర్‌పేట బీసీ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో భాగంగా మాజీ ఎంపీ వీహెచ్ కింద పడిపోయారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ కార్యకర్తలు వీహెచ్‌ను పైకి లేపారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ కొనసాగుతుంది. బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనలో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్యే దానం, మాజీ ఎంపీ వీహెచ్ అంబర్‌పేట ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో చిన్నపాటి అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో వీహెచ్ కిందపడిపోయారు. వెంటనే కాంగ్రెస్ నేతలు వీహెచ్‌ను పైకి లేపారు. ప్రస్తుతం హనుమంతరావు క్షేమంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవలే వీహెచ్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
ప్రశాంతంగా సాగుతున్న బీసీ బంద్: 42శాతం రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ను ప్రశాంతంగా పాటిస్తున్నాయి. బంద్‌లో అధికార పార్టీతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. అంతే కాకుండా పలు కులసంఘాలు సైతం బంద్‌కు పూర్తిగా మద్దతు ప్రకటించాయి.
Also Read:https://teluguprabha.net/telangana-news/kalvakuntla-kavitha-son-participated-in-bc-bandh/
వాంఛనీయ ఘటనలను సహించం: తెలంగాణ బీసీ సంఘాల బంద్‌కు అన్నిపార్టీల మద్దతు తెలపాయి. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ నేతలు బంద్‌కు పిలునిచ్చారు. సాయంత్రం 5గం. వరకు బంద్ ఉంటుందన్న బీసీ సంఘాలు పేర్కొన్నారు. అయితే శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవాలన్న తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. బంద్ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే.. చట్టం ప్రకారం అత్యంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను పోలీస్ శాఖ ఏమాత్రం సహించదని డీజీపీ స్పష్టం చేశారు.


