Monday, September 23, 2024
HomeతెలంగాణHarish Rao: సుపరిపాలనకై అహర్నిశలు కృషి

Harish Rao: సుపరిపాలనకై అహర్నిశలు కృషి

ప్రజా సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సుపరిపాలన అందిస్తామన్నారు

ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు డా.బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రోజున సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి.మధుసూదన్ నాయక్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల రాజస్వ మండల అధికారి దాసరి వేణు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ… ఉమ్మడి జిల్లాల్లో మారుమూల ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి రావాలంటే దాదాపు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎంతో శ్రమ, వ్యయప్రయాలసకు ఓర్చి ఎంతో కష్టపడవలసి వచ్చేదని గుర్తుచేశారు.

- Advertisement -

ఈక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేస్తూ నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవలో ఉంచడం జరిగిందని అన్నారు. ప్రజలు వివిధ రకాల ప్రభుత్వ సేవల కోసం జిల్లా కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ప్రతి జిల్లాలో ఒకే చోట అన్ని ప్రభుత్వ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్) భవనాన్ని ఏర్పాటు చేసి, వివిధ రకాల సేవల నిమిత్తం వచ్చే ప్రజల కోసం అన్ని శాఖలను ఒకే చోట కేంద్రీకృతం చేసినట్టు తెలిపారు. సాగు నీటిపారుదల ప్రాజెక్టులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, వైద్య కళాశాల, ఒక వేయి 200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, పర్యాటక రంగంలో కవ్వాల్ పులుల అభయారణ్యం, శివ్వారం, గాంధారి ఖిల్లా లాంటి ఎన్నో అధ్భుతమైన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామన్నారు. మంచిర్యాల నుండి అంతర్గాం వరకు గోదావరి మీదుగా వంతెన నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలని, అన్ని మున్సిపాలిటీలలో ఏర్పాటు చేస్తున్న సమీకృత కూరగాయల మార్కెట్, వైకుంఠధామాలు ఇతర ప్రజా సౌకర్యాల అభివృద్ధి వేగవంతం చేయాలని తెలిపారు. మండలాల అభివృద్ధిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పాత్ర ఎంతో కీలకమని, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లను సమన్వయం చేసుకొని పల్లెప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఇతర పనులను పూర్తి చేసేందుకు కృషి చేయాలని, పనులను శాఖల పనులుగా గుర్తించకుండా అన్ని శాఖల అధికారులు కలిసి సమిష్టిగా పని చేయాలని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందిస్తుందని, ఈ క్రమంలో చెన్నూర్ నియోజకవర్గంలో 2014కు ముందు 45 వేలు ఉన్న విద్యుత్ కనెక్షన్లను 83 వేలకు పెంచడం జరిగిందని, విద్యుత్ రంగంలో సుమారు 257 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రైతుల నుండి గత రబీలో 31 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈసారి ఇప్పటికే 61 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఆయిల్పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించి జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచనున్నట్టు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నామని, జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు.


జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గత తొమ్మిది సంవత్సరాలలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని, పోలీస్ స్టేషన్లు, కమీషనరేట్లు, ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్, వైద్య కళాశాల ఏర్పాటు చేశామన్నారు. ప్రజా సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సుపరిపాలన అందిస్తామన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి పంచాయతీ కార్యదర్శి నియమించారని, ప్రతి గ్రామపంచాయతీ, పురపాలక సంఘంలో డంపింగ్ యార్డు, వైకంఠధామం, నర్సరీ ఏర్పాట్లుతో పాటు మున్సిపాలిటీలో టి.ఎస్. – ఐ.పాస్, టి.ఎస్. బి.పాస్ ద్వారా గృహ నిర్మాణాలు, పరిశ్రమల స్థాపన కోసం అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ప్రజలను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా ప్రభుత్వ సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తిరుపతి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News