ఆందోల్ లో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.
మంత్రి హరీష్ రావు కామెంట్స్.. ఎవరు ఔన్నన్నా కాదన్నా హ్యాట్రిక్ కొట్టేది మాత్రం కేసీఆరే.. కాంగ్రెస్ వస్తే రైతు బంధు, రైతు భీమా బంద్ అవుతాయి, రేపు వచ్చే ఎన్నికల్లో మూడు గంటలు కరెంట్ ఇచ్చే వారికి ఓటేయలా..? 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే కేసీఆర్ ఓటెయ్యాలా ఆలోచించుకోండి అంటూ పిలుపినిచ్చారు.
కాంగ్రెస్ హయాంలో 30 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగితే..70 శాతం ప్రయివేట్ ఆస్పత్రుల్లో జరిగేవని గుర్తుచేసిన మంత్రి హరీష్.. ఇప్పుడు సీన్ మారిపోయి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతానికి పైగా డెలివరీలు అవుతున్నాయన్నారు.