Friday, November 22, 2024
HomeతెలంగాణHarish Rao: బీజేపీ పని అయిపోయింది, ఎవరూ చేరటం లేదు

Harish Rao: బీజేపీ పని అయిపోయింది, ఎవరూ చేరటం లేదు

అచ్చంపేట సాగునీటి పథకానికి ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పక్షాన నిర్వహించిన ధన్యవాద సభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. మంత్రి హరీశ్ రావు కామెంట్స్:

- Advertisement -

“ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు రెండు మంచి పనులు అచ్చంపేట నియోజకవర్గంలో జరిగాయి ఒకటి అచ్చంపేట 100 పడకల గవర్నమెంట్ ఆసుపత్రి రావాలి అచ్చంపేటకు కృష్ణానది నీళ్లు రావాలి ఈ రెండు ఈ రోజు జరిగాయి. 2300 కోట్లతో ఉమామహేశ్వర ప్రాజెక్ట్ చెన్నకేశవ స్వామి ప్రాజెక్టు ఆంజనేయ స్వామి ప్రాజెక్టు మంజూరు చేసిన మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. కృష్ణానది నీళ్లు అచ్చంపేటకు వస్తే రూపురేఖలే మారిపోతున్నాయి. దశాబ్దాల కలను నిజం చేసిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. తరతరాలు అచ్చంపేట నియోజకవర్గం గుర్తుపట్టుకునే గొప్ప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సాధించిం డు. త్వరితగతిన ఈ ప్రాజెక్టులు పూర్తికాడానికి నా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, నెట్టెంపాడు, దిండి అన్ని పథకాలు పూర్తయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రూపురేఖలే మారిపోతాయి. రేపు మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుంది. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమవుతాయి. గతంలో పదేళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క ఎకరానికి కూడా మేలు చెయ్యలేదు. కెసిఆర్ తోనే జలదృశ్యం విపక్షాలకు అప్పగిస్తే ఆత్మహత్యా సదృశం. అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న మన ముఖ్యమంత్రి సంక్షేమ అభివృద్ధి విషయాలపై ప్రత్యేక దృష్టి సాధించారు. నేను పోను బిడ్డ సర్కారు దావఖానకు అన్నట్టు ఉండే రోజుల నుండి నేను పోతా బిడ్డ సర్కారు దవాఖానకు అనేటట్టు చేసిండు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై అధ్యయనం చేసి ఆ రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు మాకు కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బిజెపి పని అయిపోయిందని నిన్న చేరికల కమిటీ ఛైర్మెన్ చెప్పిండు. బిజెపిలో ఎవరు చేరడం లేదు అని చేతులు ఎత్తేసిండు. ఆయన చెప్పేది వేదాంతం… చేసేది రాద్దాంతం..కడుపులంతా ఇసం..పాలమూరు ఎత్తిపోతల పథకాల గురించి నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి తెలుస్తదా. తెలంగాణ సమస్యలు తెలంగాణ ప్రజల అవసరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలిసినంతక మరి ఎవరికి తెలవదు. తెలంగాణ గొప్పతనం నిలిపే విధంగా సెక్రటేరియట్ కట్టిండు కెసిఆర్. బిజెపి నాయకుడు కూలగొడతా అన్నాడు కాంగ్రెస్ వారు పేల్చేస్తాం అన్నాడు కూల్చేటోడు పెంచేటోడు కావాలా .. తెలంగాణ నిర్మించేటోడు కావాలా.

కాంగ్రెస్ పాలన చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎరువు బస్తాల కోసం లాఠీచార్జులు పోలీస్ స్టేషన్లో లైన్ల నిలిచిన రోజులు మరిచిపోయామా. కన్నులో వత్తులేసుకుని దొంగ రాత్రికి కరెంటు కోసం ఎదురుచూసిన రోజులు రావాలా. కాలిపోయే మోటర్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కావాలా రైతుబంధు కొనసాగాలంటే మన బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలి. కాంగ్రెస్ పాలన అంటే 24 గంటల కరెంటు ఉండదు, కాంగ్రెస్ పాలన అంటే త్రాగునీరు ఉండదు, కాంగ్రెస్ పాలన అంటే 2000 పెన్షన్ ఉండదు, కాంగ్రెస్ పాలన అంటే రైతుబంధు ఉండదు, కాంగ్రెస్ పాలన అంటే రైతు బీమా ఉండదు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పార్టీ పేదల కోసం ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. “బీఆర్ఎస్ పార్టీ అంటే బిజెపికి భయం పట్టుకున్నది కాంగ్రెస్కు కల్వరం పట్టుకుంది”.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News