కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ నిండుకుండలా మారిందని బీఆర్ఎస్ పార్టీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పార్టీ హ్యాండిల్ నుంచి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. తాజాగా దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
- Advertisement -
‘వందలాది కిలోమీటర్లు ప్రయాణించి.. రంగనాయక సాగర్‌కు చేరిన గోదావరి గంగ.. ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం.. అద్భుత జల సౌందర్యం. అలాగే కాళేశ్వరాన్ని బద్నాం చేస్తున్న కబోదుల్లారా.. కళ్లు తెరిచి ఈ సుందరమైన దృశ్యాన్ని వీక్షించండి. కాళేశ్వరం తెలంగాణ ప్రాణధార అనే సత్యాన్ని చెరిపేయలేమని గుర్తించండి’ అని ఆయన వెల్లడించారు.