బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి(kaushik Reddy) బెయిల్ రావడంపై మాజీ మంత్రి, హరీశ్‌రావు (Harish Rao) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కౌశిక్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బెయిలబుల్ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా చెప్పాయన్నారు. పండగ పూట టెర్రరిస్టు లాగా కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడం తప్పు అని మండిపడ్డారు. కాగా కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో అంతకుముందు హరీశ్‌రావు, కేటీఆర్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తనను అక్రమంగా అరెస్ట్ చేయించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడులైన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టు నిబంధనల ప్రకారం కరీంనగర్‌లో ప్రెస్ మీట్ పెట్టనని.. బుధవారం తన అరెస్టుపై హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడతానని తెలిపారు.