మారుతున్న మనిషి జీవనవిధానంతో అతిచిన్న వయస్సులో గుండే సంబంధిత వ్యాదుల బారిన పడుతు వారిని కాపాడే తక్షణ తరుణోపాయం సీపీఆర్ విధానం గురించి అందరూ అవగాహనను కలిగి ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కార్డియాక్ హెల్త్ స్క్రీనింగ్, మీ గుండే పదిలం కార్యక్రమానికి గెస్టుగా వచ్చారు హరీష్.
రాష్ట్రంలో కరోనా తరువాత ఆరోగ్య పరిస్థితులలో మార్పులు చోటుచేసుకుని కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వంటి హృద్రోగ సమస్యలు వస్తున్నాయన్నారు. మనతోనే ఉండి గుండే సంబంధిత సమస్యతో కుప్పకూలే వారిని తక్షణం రక్షించడంలో బాగంగా వారిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ ఫోన్ చేయడం మాత్రమే కాదు సిపిఆర్ విధానం ద్వారా ఛాతి పైభాగంలో నొక్కడం, నోటిద్వారా శ్వాసను అందించడం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఒక్కప్పుడు వయస్సుపైబడిన వారికి మాత్రమే వచ్చే హృద్రోగ సమస్యలు ఇప్పుడు 18 సంవత్సరాల పిల్లలు కూడా చనిపోతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితులను జిల్లాలోని విద్యార్థులు ఎదుర్కోకుండా, కళాశాల స్థాయి 18 సంవత్సరాల మొదలుకొని 40 సంవత్సరాల వరకు గల విద్యార్థులకు ఐఎంఏ సహకారంతో ఉచితంగా గుండె స్క్రీనింగ్, ఈసిజి, 2డి ఎకో వంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులను కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు.
కాలేజీల్లో యోగా, ప్రాణాయామం ప్రతిరోజు క్లాసులలో భాగంగా నిర్వహించాలని, తద్వారా పిల్లలు మానసిక ఒత్తిడిని, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలొ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. వాకింగ్ వలన కూడా ఆరోగ్య పరీస్థితులను మెరుగు పరుచుకోవచ్చని పేర్కోన్నారు. కళాశాల విద్యార్థుల కొరకు ప్రత్యేక కంటివెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.