నంగునూర్ మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమానికి ఎంఎల్ సి దేశపతి శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, మండల నాయకులు హాజరయ్యారు. సీఎం కెసిఆర్ గులాబీ జెండా నంగునూర్ నుండే ప్రారంభించాడని, అందుకే ఈ సమావేశాలు ఇక్కడ ప్రారంభించామని తెలిపారు. నాడు ఈ మండలం నుండి కెసిఆర్ సైకిల్ తొక్కితే ఇక్కడి ప్రజలు దివిస్తే దివెనతో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని హరీష్ రావు గుర్తుచేశారు. సిద్దిపేట పేరును కెసిఆర్ ఆకాశం అంతా ఎత్తుకు తీసుకెళ్ళాడని, ఏ రంగంలో అభివృద్ధి చూసినా జమీన్ అస్మిన్ అంత ఫరక్ ఉందని రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధిని హరీష్ వివరించారు.
కార్యకర్తలను మించిన నాయకులు లేరని, మీరు ప్రజలకు ఈ అభివృద్ధిని వివరించాలని హరీష్ ఉద్భోదించారు. రైతులు కారులో వచ్చే కాలం రావాలి అనేది తన ప్రయత్నమని, అది కూడా దగ్గరలోనే ఉందన్నారు మంత్రి హరీష్.