Friday, September 20, 2024
Homeతెలంగాణతెలుగుప్రభ పుస్తకాలను ఆవిష్కరించిన హరీష్ రావ్

తెలుగుప్రభ పుస్తకాలను ఆవిష్కరించిన హరీష్ రావ్

దేశానికి దిక్సూచి కేసీఆర్, ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత కేసీఆర్ ఆవిష్కరించిన మంత్రి

పత్రికా రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న తెలుగుప్రభ దినపత్రిక ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఒక పుస్తకాన్ని ప్రచురించడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో తెలుగుప్రభ దినపత్రిక ఆధ్వర్యంలో ప్రచురించిన దేశానికి దిక్సూచి కె.సి.ఆర్., ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో మైలురాళ్లను అధిగమించారని పేర్కొన్నారు. ఉద్యమ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు పుస్తక రూపంలో తీసుకరావడం ఒక తెలుగుప్రభ దినపత్రికకే సాధ్యమైందన్నారు. నిజాలను నిక్కచ్చిగా ప్రజల ముందుకు తీసుకు రావడంలో తెలుగు ప్రభ దినపత్రిక యాజమాన్యం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రభ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి, కరీంనగర్ ఆర్.సి. వంగల రాజేష్, బి.ఆర్.ఎస్. నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News