తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు(Harish Rao), పద్మారావు గౌడ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో దాదాపు 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గాల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించట్లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
- Advertisement -
అంతకుముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. సభ వాయిదా పడిన కాసేపటికే ప్రొటోకాల్ అంశంపై ఇద్దరు భేటీ అయి చర్చించుకోవడం ఆసక్తిగా మారింది. రాజకీయాలు అంటే ఇలాగే ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.