Tuesday, June 24, 2025
HomeతెలంగాణKCR: మాజీ సీఎం కేసీఆర్‌తో హరీశ్‌ రావు భేటీ

KCR: మాజీ సీఎం కేసీఆర్‌తో హరీశ్‌ రావు భేటీ

కాళేశ్వరం కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌(KCR)ను మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్‌ 5న విచారణకు రావాలని కేసీఆర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై విచారణ కోసం ప్రభుత్వం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీశ్ రావు, జూన్ 7న ఈటల రాజేందర్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News