తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) మరోసారి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్ సినిమాకి టంగ్ చేంజర్‌గా మారారని సెటైర్లు వేశారు. చిత్ర పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి కాని బ్లాక్ మెయిల్ చేయకూడదన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వనని.. టికెట్ రేట్లు పెంచనన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మరి ఈ సినిమాకు ఎందుకు అనుమతి ఇచ్చారని విమర్శించారు.
ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇచ్చిన మాట మీద ఉండాలి.. లేదా అందరినీ సమానంగా చూడాలని తెలిపారు. అంతేకానీ తనకు నచ్చితే ఒకలా.. నచ్చకపోతే ఒకలా ఉంటా ఉంటే చిత్ర పరిశ్రమకి నష్టం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి మాట తప్పితే సీఎం కుర్చీకి గౌరవం ఉండదన్నారు. చిత్ర పరిశ్రమ పెరుగుదలలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుగుదల ఉందని హరీశ్ రావు వెల్లడించారు.