Saturday, November 23, 2024
HomeతెలంగాణHarish Rao: 'పవర్ హాలిడే'లిచ్చిన కాంగ్రెస్కు ప్రజలు శాశ్వతంగా హాలిడే ఇచ్చారు

Harish Rao: ‘పవర్ హాలిడే’లిచ్చిన కాంగ్రెస్కు ప్రజలు శాశ్వతంగా హాలిడే ఇచ్చారు

తెలంగాణకు కేసిఆర్ శ్రీరామరక్ష

మెదక్ జిల్లాలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ,జిల్లా కలెక్టర్, స్థానిక నాయకులు విద్యుత్ ఉద్యోగులు అధికారులతో పాటు వినియోగదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తు శాఖ రూపొందించిన తెలంగాణా సాధించిన విద్యుత్ ప్రగతి చిత్రాన్ని తిలకించిన మంత్రి .ఆ తర్వాత వివిధ రకాల వినియోగదారులతో విద్యుత్తు వినియోగం పై వారి అనుభవాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

మంత్రి హరీష్ కామెంట్స్ :

ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే ఇన్వర్టర్, జనరేటర్లు తప్ప ఏమి కనిపించేవి కాదు.అపుడు రైతుల కష్టం మాటల్లో చెప్పలేనిది. విద్యుత్ రంగం సాధించిన ఎన్నో గొప్ప విజయాలు అనుభవాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి రైతుల కరెంట్ బిల్లు పెంచి ముక్కు పిండి బిల్లు వసూలు చేసేవాళ్లు. అప్పటికే కరువుతో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మూలిగే నక్కపై తాటి పండు పడినట్టు విద్యుత్ బిల్లులు పెంచిండు. అప్పుడు ఆ సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే తప్ప మన కష్టాలు తీరవని గులాబీ జెండా ఎత్తిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. పెంచిన కరెంటు బిల్లు పై ఉద్యమిస్తే బషీర్ బాగ్ దగ్గర రైతులను కాల్చి చంపిన ప్రభుత్వాలను మనం చూశాం. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఓ న్ యువర్ ట్రాన్స్ఫారం అనే పథకం కింద రైతులు అప్పుచేసి తమ ట్రాన్స్ఫార్మర్లు కొనుక్కునే విధంగా స్కీములు తెచ్చింది. తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే ఉచిత కరెంటు తప్ప పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు. కళ్ళల్లో వత్తులు ఏసుకొని ఎదురు చూసేవారు కరెంట్ ఎప్పుడు వస్తుందా అని. దొంగ రాత్రి కరెంటు ఇస్తే రైతులు కరెంట్ షాకులు కొట్టి తేలు, పాములు కుట్టి చనిపోయేవారు.

అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నై అని రెండు రోజులు పవర్ హౌస్ సబ్స్టేషన్ వద్ద నిరాహార దీక్ష చేసి రెండు రోజులు సబ్ స్టేషన్ దగ్గరే పడుకున్నాము. అప్పుడు ఆ ముఖ్యమంత్రిని ఒప్పించి 100 ట్రాన్స్ఫార్మర్లు సిద్దిపేటకు తెస్తే ఉమ్మడి మెదక్ జిల్లా జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే సిద్దిపేటకు ట్రాన్స్ఫర్ ఎట్లా ఇస్తారు అని కొట్లాడిన రోజులవి. ఇప్పుడు మోటర్లు కాలుడు లేదు, ట్రాన్స్ఫారములు పేలుడు లేదు , పైరవీకారులు అసలే లేరు. లంచాలు ఇచ్చే పరిస్థితి అంతకంటే లేదు. రైతులకు కావాల్సినన్ని ట్రాన్స్ఫారంలు తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నాం.

తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక లాభం పొందని ఒక్క మనిషి కూడా లేడు అని నేను ఓ సందర్భంలో అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాకేమీ ఇచ్చారు చెప్పు అని అడిగిండు…అప్పుడు నేను నీకు పొలంకి రైతుబంధు వస్తుంది వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమే. లాభం కాలేదా అని అడుగుతే అవును అని అంగీకరించిన పరిస్థితి. కరెంటు కష్టాల వల్ల పరిశ్రమలు మూత పడేటివి. కార్మికులు ఇబ్బంది పడేవారు. తినేదానికి తిండి ఉండని పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటలు కరెంటు అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అన్ని రంగాలకు అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వ మన కేసీఆర్ ప్రభుత్వం. కేంద్ర బీజేపీ వాళ్లు కరెంట్ ప్రైవేటీకరణ చేసి కంపెనీలకు అమ్మి ఉద్యోగాలు ఊడగొడితే సంవత్సరానికి 5000 కోట్లు ఇస్తామన్నారు.

తెలంగాణకు కేసిఆర్ శ్రీరామరక్ష

కేసీఆర్ కష్టపడి మెదడును కరిగిస్తే ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంటు ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం. విద్యుత్ పంపిణీ నీ బలోపేతం చేసేందుకు 39 వేల కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెచ్చించారు. అందుకేనే ఈరోజు ఫ్రిడ్జ్ లు కాల్త లేవు మోటర్లు కాలుతలేవు ట్రాన్స్ఫారంలో కాలుతలేవు. కాంగ్రెస్ పాలన వస్తే మళ్లీ అదే పాత రోజులు తిరిగి వస్తాయి. మోటర్లు ట్రాన్స్ఫారంలు కాలుతాయి 24 కరెంట్ బంద్ అయితది. సమర్థవంతమైన నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంది. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఎందుకు వస్తలేదు అని అంటే అక్కడ కెసిఆర్ లాంటి దమ్మున్న నాయకుడు లేడు కాబట్టి ఆ రాష్ట్రాలు అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగుల కృషి, కేసీఆర్ పట్టుదల వల్లే ఈ లక్ష్యాన్ని సాధించగలిగాం. తెలంగాణ ఈరోజు దేశంలోనే వెలుగుల తెలంగాణగా మారింది. పవర్ హాలిడేలు ఇచ్చిన కాంగ్రెస్కు శాశ్వతంగా ప్రజలు హాలిడే ప్రకటించారు. విరామం లేకుండా కరెంటు ఇచ్చిన కేసీఆర్ కు విరామం లేకుండా పవర్ ఇచ్చారు ప్రజలు. ఈరోజు తెలంగాణకి పరిశ్రమలు తరలి రావడం వల్ల పరిశ్రమలో 20 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగాం అన్నారు హరీష్ రావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News