తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఫిబ్రవరి 18వ తేదీ మర్చిపోలేని రోజు. ఎందుకంటే దశాబ్ధాల కల అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు(Telangana Bill) లోక్‌సభలో ఆమోదించబడిన తేదీ. ఈ చారిత్రాత్మకమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. లోక్‌సభలో బిల్లు ఆమోదించిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్(KCR)తో అప్పటి టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్న ఫొటోను షేర్ చేశారు.
కేసీఆర్ లాంటి దార్శనికత కలిగిన నాయకుడి నాయకత్వంలో ప్రజా ఉద్యమం విజయం సాధించిన రోజు అని రాసుకొచ్చారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రజాఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన సందర్భమని పేర్కొన్నారు. పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన రోజు అని తెలిపారు. ఈ ఫొటోలో కేసీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, విఠల్, సంతోష్ రావు, తదితర నేతలున్నారు.