తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రాష్ట్ర అప్పులపై స్వల్ప కాలిక చర్చ సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) మాట్లాడుతున్న సమయంలో ఓ సభ్యుడు దొంగ అని అరిచారు. దీంతో హరీష్ రావు ‘ఎవడయ్యా యూజ్ లెస్ ఫెలో.. దొంగ అన్నది’ అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనను దొంగ అంటే తాను యూజ్ లెస్ ఫెలో అన్నాను.. ఇది తప్పా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడింది ఎవరికి వినబడలేదని కానీ హరీశ్ రావు మైక్‌లో మాట్లాడింది అందరికీ వినిపించిందని ఫైర్ అయ్యారు. తనపై రన్నింగ్ కామెంటరీ చేసిన సభ్యుడిని తాను అన్నానని హరీశ్ క్లారిటీ ఇచ్చారు.
దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(rajagopal reddy) కలుగజేసుకుని ఆన్ రికార్డు మైక్‌లో ఓ సభ్యుడిని యూజ్ లెస్ ఫెలో అనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే మీరు జీర్ణించుకోవడం లేదన్నారు. అందుకే అసహనంతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని.. తక్షణమే హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా హరీశ్ రావు వ్యాఖ్యలను స్పీకర్ రికార్డులో నుంచి తొలగించారు.