Friday, November 22, 2024
HomeతెలంగాణHeavy rains KTR review: భారీ వర్షాలపై కేటీఆర్ సమీక్ష

Heavy rains KTR review: భారీ వర్షాలపై కేటీఆర్ సమీక్ష

లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేశాం, ప్రాణ నష్టం జరగకుండా చూడటం మా ప్రాధాన్యత-కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితుల పైన సమీక్ష నిర్వహించారు పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు. హైదరాబాదు నుంచి పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామన్నారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించా,న్నారు.

- Advertisement -

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, పురపాలక శాఖ అధికారులతోనూ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారన్నారు. హైదరాబాద్ నగరంలోనూ జిహెచ్ఎంసి కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు… క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని, పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులను రద్దు చేశామన్నారు.  పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నామన్నారు. కుంభవృష్టిగా వర్షం పడడం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నదని, కానీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా సాధ్యమైనని ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని… భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలన్నారు కేటీఆర్. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం  దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుందన్నారు. వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నామని, ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూసి వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామన్నారు, వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు.. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తానంటూ కేటీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News