Sunday, July 7, 2024
HomeతెలంగాణHero Suman in Jammikunta: జమ్మికుంటలో హీరో సుమన్ సందడి

Hero Suman in Jammikunta: జమ్మికుంటలో హీరో సుమన్ సందడి

సినిమా షూటింగ్ కోసం వచ్చిన సుమన్

జమ్మికుంట పట్టణానికి సినీ హీరో సుమన్ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు, పట్టణ ప్రజలు ఆసక్తిని కనబరిచారు. అమ్మ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు జమ్మికుంట పట్టణానికి వచ్చిన సందర్భంగా అభిమానులు ఆయనకు టపాసులు కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ స్థానిక అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు హీరో సుమన్ కు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News