High court dismissed the cases against Bandi Sanjay and KTR: 2023లో కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. దీంతో వారికి ఊరట లభించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
2023లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కమలాపూర్ పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని హైకోర్టు దృష్టికి బండి సంజయ్ తరఫు న్యాయవాది తీసుకొచ్చారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేసు నమోదులో సరైన సెక్షన్లు, దర్యాప్తులో పూర్తి వివరాలు లేవని పేర్కొంది. ఈ మేరకు కేసును కొట్టివేసింది.
Also Read: https://teluguprabha.net/technology-news/nokia-qled-smart-tv-features-and-price/
మరోవైపు 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్‌ను ఉల్లంఘించారని మాజీ మంత్రి కేటీఆర్, గోరటి వెంకన్నపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి వద్ద ప్రభుత్వ పథకాలపై కేటీఆర్‌ను గోరటి వెంకన్న ఇంటర్వ్యూ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా అనుమతి లేకుండా డ్రోన్లు ఎగురవేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చేలా ఈ కార్యక్రమాలు జరిగాయని ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. కాగా, రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్, గోరటి వెంకన్నపై కేసు నమోదు చేశారని వారి తరఫు న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో ప్రస్తావించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బండి సంజయ్ కేసులో ఏం జరిగిందంటే..
2023 ఏప్రిల్‌లో టెన్త్ వార్షిక పరీక్షలు జరుగుతుండగా హన్మకొండ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. పరీక్షకు ముందు పలు వాట్సాప్ గ్రూప్‌లలో లీక్ అవ్వగా.. ఈ పేపర్ లీకేజీ వెనుక అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు.
ఈ క్రమంలో బండి సంజయ్‌కు హన్మకొండ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించారు. కొన్నిరోజులకి ఆయన బెయిల్‌పై విడుదల కాగా.. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు కేసును కొట్టివేయడంతో ఇది బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు అని బీజేపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
హైకోర్టు తీర్పుతో సత్యం గెలిచిందంటూ బండి సంజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘అప్పటి BRS ప్రభుత్వం నాపై దాఖలు చేసిన కల్పిత పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఇది BJP నోరు మూయించడానికి చేసిన అధికార దుర్వినియోగం మాత్రమే. నాకు దానితో సంబంధం లేదని వారికి తెలుసు. అయినప్పటికీ వారు పోలీసులను ఆయుధంగా చేసుకుని నన్ను అరెస్ట్ చేయించారు. BRS నాయకత్వం అంతగా దిగజారిపోయింది. మా ఇంట్లో ఓ కార్యక్రమం రోజున నన్ను రోడ్డుపైకి లాగారు. వారికి మర్యాద లేదు. మానవత్వం లేదు. ఇది పచ్చి రాజకీయ ప్రతీకారం మాత్రమే.’ అని ‘X’ వేదికగా బీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు.
Satyameva Jayate.
The High Court has quashed the cooked-up Tenth Class paper leak case that the then-BRS government filed against me. This was a blatant misuse of power to silence BJP.
They knew I had nothing to do with it, yet they weaponised the police to settle scores.… https://t.co/c47qJqdSff
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 20, 2025

