Wednesday, April 16, 2025
Homeతెలంగాణదిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లపై కాసేపట్లో హైకోర్టు తీర్పు.. ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ..!

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లపై కాసేపట్లో హైకోర్టు తీర్పు.. ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ..!

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ను భయపెట్టిన ఉగ్రవాద దాడికి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇవాళ (మంగళవారం) తీర్పును వెల్లడించనుంది. 2013 ఫిబ్రవరి 21న చోటు చేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు చేపట్టి, ఐదుగురు నిందితులను ఉరిశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.

- Advertisement -

అయితే ఆ ఉరిశిక్షను సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా.. వాదనలు ముగిసిన నేపథ్యంలో ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఉగ్రదాడికి పాల్పడిన వారిని శిక్షించాలనే న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఆశలు నెలకొన్నాయి. దోషులకు తక్షణం ఉరిశిక్ష అమలు చేయాలని.. తమకు న్యాయం కలగాలంటూ పేలుళ్ల ఘటనలో బాధితుల కుటుంబాలు గళమెత్తుతున్నాయి. ఈ దాడికి ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ చెందిన సభ్యులే బాధ్యత వహించారనే దానిపై ఎన్ఐఏ దర్యాప్తులో స్పష్టత వచ్చింది.

టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టి, సమయాన్ని ఎంచుకుని పేల్చిన ఈ ఉగ్రదాడి దేశాన్ని ఊపేసింది. దాడిలో ప్రధాన సూత్రధారులుగా యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్, జియా ఉర్ రెహమాన్, అజాజ్ షేక్‌లను గుర్తించి, 157 మంది సాక్షుల వాంగ్మూలాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సంఘటనకు పదేళ్లు గడిచినప్పటికీ బాధితులకు న్యాయం జరిగిందా అనే ప్రశ్న ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News