Friday, November 22, 2024
HomeతెలంగాణCM KCR: దారిపొడుగునా జయజయ ద్వానాలతో జన నీరాజనాలు!

CM KCR: దారిపొడుగునా జయజయ ద్వానాలతో జన నీరాజనాలు!

CM KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం జగిత్యాలలో పర్యటించారు. వాయుమార్గంలో మధ్యాహ్నం 1.31 గంటలకు జగిత్యాల పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ కు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1.42 గంటలకు మొదట నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా కార్యాలయంలో గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లాశాఖ అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును ఆయన సీట్లో స్వయంగా కూర్చుండబెట్టి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం మధ్యాహ్నం 2.04 గంటలకు శంకుస్థాపన చేసి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకోగానే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం 2.21 గంటలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని ఉచితాసనంలో కలెక్టర్‌ జి.రవి నాయక్ ను స్వయంగా కూర్చుండబెట్టిన సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అనంతరం సాయంత్రం 4.07 గంటలకు సీఎం కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభలో పాల్గొన్నారు.

సీఎం కేసిఆర్ జగిత్యాల పర్యటన హై లైట్స్:
• జగిత్యాల చుట్టూ కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్
• సభా ప్రాంగణంలోకంటే మూడింతల బయటే చిక్కుకున్న జనం.
ప్రగతి జైత్రయాత్ర ను తలపించిన జగిత్యాల బహిరంగ సభ..
• జగిత్యాల పర్యటనలో సీఎం కేసిఆర్ పర్యటిస్తున్నప్పుడు..దారిపొడుగునా జయజయ ద్వానాలతో జన నీరాజనాలు..
• సీఎం రాక తో జన సంద్రమైన జగిత్యాల
• కేసీఆర్ ప్రగతి గర్జనతో ప్రతిధ్వనించిన సభ
• తమ ప్రియతమ నేత సీఎం కెసీఆర్ సభాస్థలికి రావడం తో జనం లో ఉప్పొంగిన ఉత్సాహం
• జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో మార్మోగిన ప్రాంగణం
• తమ ఆత్మీయ నాయకుడిని చూసి చప్పట్లు కేరింతలతో హర్షం..

• పిల్లలూ, పెద్దలూ, ఆడవాళ్లు, ముసలివాళ్లనే తేడా లేకుండా స్వాగతం పలికిన ప్రజలు
• ఉత్సాహంతో కేరింతలు కొట్టిన యువత..
• తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేసిన ఉత్సాహం, ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిన సభ
• దిగ్విజయవంతమైన సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన
.
• కొండగట్టు అంజన్న, ధర్మపురి నర్సన్న ప్రస్తావనలతో ఆ దేవస్థానాల ప్రాశస్త్యాన్ని వివరించిన సీఎం
• ధర్మపురి నర్సింహస్వామి పుణ్యక్షేత్రంపై శేషప్పకవి రాసిన పద్యాన్ని ఉటంకించిన సీఎం కేసీఆర్..
• కేసీఆర్ ఆధ్యాత్మిక ప్రసంగంతో ప్రతిస్పందించిన ప్రజానీకం..

• కరీంనగర్ లో వరద కాల్వలను అభివృద్ధి చేసుకున్నం అని చెప్పిన సీఎం
• నియోజకవర్గాల అభివృద్ధికి కేసీఆర్ వరాలు
• ప్రజల్లో గొప్పగా కనిపించిన ప్రతిస్పందన
• పుణ్యభూమిలో దైవక్షేత్రాల అభివృద్ధికి ప్రకటన
• కొండగట్టు దేవస్థాన అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
• జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.10 కోట్ల చొప్పున నిధులు
• కేసీఆర్ బతికున్నంతవరకూ రైతుబంధు, రైతుబీమా ఆగబోదని పునరుద్ఘాటన
• తెలంగాణను తెర్లు చేసే బయటిశక్తులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ హెచ్చరిక
• మేకిన్ ఇండియా అంటే ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం కేసీఆర్

• పేదలకు సంక్షేమం వద్దు కానీ, కార్పొరేట్లకు అన్నీ కట్టబెడుతారా అని ప్రశ్న
• ఎన్.పీ.ఏ ల పేరుతో 14 లక్షల కోట్ల రుణాల రద్దు చేసి ఎవరికి దోచిపెడుతున్నారు
• ఎల్ఐసీ సంస్థకు చెందిన 35 లక్షల కోట్ల విలువైన ఆస్తులను అమ్ముతారా?
• మీరు చేసేది పెట్టుబడిదారుల సంక్షేమమా.. పేదల సంక్షేమమా?
• సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ కానేకాదు.. సబ్ కా బక్వాస్..
• ఇప్పటికే పది వేల పరిశ్రమలు మూతబడిపోయాయి
• ఏడాదికి 10 వేల మంది పారిశ్రామికవేత్తలు దేశాన్ని వదిలి పోతున్నరు.
• దేశ ప్రజలు పిడికిలి బిగించాలని దేశ ప్రజలకు పిలుపు
• అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్లయింది బీజేపీ పరిస్థితి
దేశంలో ఎక్కడ చూసినా చైనా ఉత్పత్తులేనా? అని ఎద్దేవా చేసిన సీఎం..
• భారతదేశంలోని పల్లెలు, పట్టణాల్లో చైనా బజార్లు ఎట్లా వెలిసినయి
• ఊరూరా చైనాబజార్లుంటే.. మరి ఇండియా బజార్లు ఎక్కడ పోయినయి.
• అందుకే మోసపోతే గోస పడుతం.. మల్లా 100 ఏండ్లు వెనకబడిపోతం
• నాటి తెలంగాణ నాయకత్వం చేసిన పొరపాటు వల్ల 60 ఏండ్లు కొట్లాడినం, త్యాగాలు చేసినం
• మల్లా అదే పొరపాటు మనం చేయవద్దు. అప్రమత్తంగా ఉండాలె.
• వరద కాల్వల మీద మనం మోటార్లు పెట్టీ నీళ్లు పారించుకుంటున్నం
• ఇప్పటిదాకా మనల్ని అడిగెటోడు లేనే లేడు.
• ఇపుడు కేంద్రం మీటర్లు పెట్టాలంటున్నది. పెడదామా? మీరే చెప్పండి
• వద్దు వద్దు అని అడ్డంగా చేతులు ఊపిన ప్రజానీకం
• రైతుబంధు ఇచ్చే రాజ్యం ఎక్కడా లేదు.. మన తెలంగాణ తప్ప అని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
• జై తెలంగాణ.. జై భారత్.. అని నినదిస్తూ, ప్రసంగాన్ని తన ముగించిన సీఎం కేసీఆర్ గారు.

ఈ కార్యక్రమంలో.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు దామోదర్ రావు, వెంకటేశ్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, చెన్నమనేని రమేశ్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బాల్క సుమన్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు కవిత, ఎల్.రమణ, గంగాధర్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంవో అధికారులు స్మితా సభర్వాల్, ప్రియాంక వర్గీస్, వివిధ కార్మొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, కోలేటి దామోదర్ గుప్తా, అనిల్ కూర్మాచలం, రవీందర్ రావు, జెడ్పీ చైర్మన్ వసంత, మున్సిపల్ చైర్మన్ శ్రావణి, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, రాజేశ్వర్ రావు, ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్ గౌడ్, మెడికల్ డీఎంఈ రమేశ్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్కిటెక్ట్ ఉషా రెడ్డి, కలెక్టరేట్ నిర్మాణ సంస్థ నవతేజ్ ఇన్ ఫ్రా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు రాజారాం యాదవ్, రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News